
ఘనంగా రవీంద్రనాథ్‌రెడ్డి జన్మదిన వేడుకలు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి జన్మదిన వేడుకలు కడప నగరంలో ఘనంగా జరిగాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాలు ఆయనకు పుష్ఫగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ తెచ్చి, గజమాల వేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర ఆధ్వర్యంలో భారీ కేక్ తెచ్చి ఆయనతో కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ తరపున వి. నాగేంద్రారెడ్డి, రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో జ్ఞాపిక అందజేశారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట సుబ్బారెడ్డి, మైనార్టీ నాయకుడు దస్తగిరి, పార్టీ నాయకులు ఎస్. వెంకటేశ్వర్లు, దాసరి శివప్రసాద్, టీపీ వెంకట సుబ్బమ్మ, రామ్మోహన్‌రెడ్డి, సీహెచ్ వినోద్, మేసా ప్రసాద్, షఫీవుల్లా, షేక్ షఫీ, ఆర్. చెన్నయ్య, బండి ప్రసాద్, శ్రీరంజన్‌రెడ్డి, బాలస్వామిరెడ్డి, వేణుగోపాల్ నాయక్, బీహెచ్ ఇలియాస్, త్యాగరాజు, పత్తి రాజేశ్వరి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.