
ప్లాన్ లేకుండా అక్రమ నిర్మాణాలు
● కల్యాణ మండపం,
షాపు రూముల ఏర్పాటు
● చోద్యం చూస్తున్న నగరపాలక
ప్లానింగ్ అధికారులు
కడప కార్పొరేషన్ : కడప నగరంలో ఎలాంటి ప్లా న్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్నా నగరపాలక టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తు న్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగర శివార్లలో ఇందిరానగర్ సమీపంలో ఉన్న సాయిబాబా నగర్(ఎస్టీ కాలనీ)లో ఇందిరాగాంధీ హయాంలో యానాదులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ కాలనీలో 60 కుటుంబాలు నివాసం ఉంటు న్నాయి. ఇక్కడ నివాస గృహాలకు తప్పా పాఠశా ల, అంగన్‌వాడీ కేంద్రం తదితర వాటికి స్థలాలు లేవు. కానీ అధికార పార్టీకి చెందిన అగ్రవర్ణాల వారు ఈ కాలనీలో ప్రవేశించి సుమారు 0.20 సెంట్లలో కల్యాణ మండపం, షాపు రూములు నిర్మించారు. ఈ షాపు రూములను వైన్ షాపులకు బాడుగకు ఇచ్చారు. అయితే ఎలాంటి ప్లాన్ అప్రూవల్స్ లేకుండా నిర్మించిన ఈ నిర్మాణాల పట్ల నగరపాలక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మామిళ్లపల్లె గ్రామ పొలం సర్వే నంబర్ 729లో నివాస గృహాలకు మాత్రమే కేటాయించిన స్థలాలను, వంక పొరంబోకు స్థలాలను ఆక్రమించి వ్యాపార సముదాయాలను నిర్మించడం పట్ల ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో రిమ్స్‌తోపాటు ఇతర హాస్పిటల్స్, విద్యాసంస్థలు నెలకొనడంతో భూములకు విలువ పెరిగింది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను అమ్మడం, కొనడం నేరమైనా సరే పేదలకు పదో పరకో ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నారని తెలుస్తోంది. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఈ స్థలాలను ఆక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అక్రమ నిర్మాణాల పట్ల టౌన్‌ప్లానింగ్ అధికారులు ఎందుకు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికై నా అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని పలువురు కోరుతున్నారు.
సాయిబాబా నగర్‌లో ఆక్రమించేందుకు చదును చేసిన స్థలం
సాయిబాబా నగర్(ఎస్టీ కాలనీ)లో
ప్లాన్ లేకుండా చేపట్టిన నిర్మాణాలు

ప్లాన్ లేకుండా అక్రమ నిర్మాణాలు