
మాజీ సైనికుల కోసం న్యాయ సేవల క్లినిక్ ప్రారంభం
కడప అర్బన్ : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కడప నగరంలోని జిల్లా సైనిక బోర్డులో బుధవారం మాజీ సైనికుల కోసం న్యాయ సేవల క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని మాట్లాడుతూ న్యాయ సంబంధ సమస్యల పరిష్కారం కోసం ఈ క్లినిక్‌ను సందర్శించవచ్చన్నారు. ఒక ప్యానల్ న్యాయవాది, ఒక పారా లీగల్ వలంటీర్ అందుబాటులో ఉంటారన్నారు. వీరు ప్రతి సోమ, శుక్రవారాల్లో మాజీ సైనికుల సమస్యలను తెలుసుకుని వారికి తగు సలహాలను ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్‌లు ఎమ్.శాంత, ఎన్.చంద్రకాంతమ్మ, ఎం.వినయ్ కుమార్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పి.మనోహర్, ఎం సౌజన్య, ఎన్. నీలకంఠేశ్వర రెడ్డి, షేక్ అక్బర్ అలీ, ఏఎస్.రవితేజ, కడప మాజీ సైనికుల సంక్షేమ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఆర్.సుధాకర్ రెడ్డి, పారా లీగల్ వలంటీర్ బీవీ గోపాల్ రెడ్డి, మాజీ సైనికులు పాల్గొన్నారు.