
పెన్నా ప్రాంతంలో డ్రోన్‌లతో పర్యవేక్షణ
కడప అగ్రికల్చర్ : అల్పపీడనం కారణంగా జిల్లావ్యాప్తంగా పది రోజుల నుంచి వర్షాలు కొనసాగుతున్నా యి. ఈ వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, రైతు లు విసిగివేసారి పోతున్నారు. నిన్నామొన్నటి వరకు వర్షాల కోసం ఎదురుచూసిన అన్నదాతలు నేడు ఈ వర్షాలు వద్దుబాబోయ్ అనే పరిస్థితికి చేరుకున్నారు. వరుసగా పడుతున్న వర్షాలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పూర్తిగా పారిశుధ్యం లోపించింది. దీంతో దోమల బెడద అధికమై జనాలు జ్వరాల బారిన పడుతున్నారు. ఇక అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిత్యం కురుస్తున్న వర్షాలకు భూమి తడారక ఆరుతడి పంటలు ఎర్రగా మారి దెబ్బతింటున్నా యని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. పంటల్లో కనీసం కలుపు మొక్కలను తీద్దామన్నా కష్టతరంగా మారిందని వాపోతున్నారు.
జిల్లాలో 65 హెక్టార్లలో పంటలకు నష్టం...
జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు, వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాలిల్లుతోంది. ఇందులో భాగంగా పెద్దముడియం మండలంలో 25 హెక్టార్లలో, మొక్కజొన్న, 20 హెక్టార్లలో కమలాపురం మండలంలో 20 హెక్టార్లలో మినుమపంటలకు నష్టం వాలిటినట్లుగా వ్యవసాయశాఖ గుర్తించింది. ఇలా వర్షం ఇలాగే కొనసాగితే ఇంకా మొక్కజొన్నతోపాటు మినుము, ఉల్లి, పత్తి, పూల పంటలకు కూడా నష్టం వాలిట్లే అవకాశం ఉంది.
విద్యుత్ శాఖ హెచ్చరిక...
మైదుకూరు పోరుమామిళ్ల రోడ్డులో సోమవారం ఎర్రచెరువు దగ్గర పొలం పనుల నిమిత్తం మోటా రు వేస్తుండగా విద్యుత్ షార్ట్ సర్యూట్ అయి పవన్‌కుమార్(38) అనే రైతు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వర్షాలకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యుత్తుశాఖ హెచ్చరికలతో పాటు పలు సూచనలు జారీ చేసింది. వర్షపు వేళ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఎలక్ట్రిక్ తీగలు, ఇతర పరికరాల దగ్గర గుమికూడదని తెలిసింది. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగి పడివుంటే 1912 నంబర్‌కి సమాచారం ఇవ్వాలని సూచించారు.
పాత ఇళ్లు, మట్టి మిద్దెలతో అప్రమత్తం
మైదుకూరు: జడివానతో జిల్లాలో పలు ప్రాంతాల్లో మట్టి మిద్దెలు కూలుతున్నాయి. మట్టి, పాత మిద్దెలు ఉన్న వారు వర్షాలతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటీవల జమ్మలమడుగు ప్రాంతంలో ఇళ్లు కూలాయి. తాజాగా మైదుకూరులో ఓబులమ్మ అనే ఒంటరి మహిళ మట్టి మిద్దె కూలిపోయింది.
జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షం...
అల్పపీడనం కారణంగా సోమవారం తెల్లవారుజా మున నుంచి జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిసాయి. ఇందులో భాగంగా దువ్వూరులో అత్యదికంగా 25.2 మి.మీ వర్షం కురిసింది.
అన్నదాతల్లో అలజడి
దెబ్బతింటున్న మొక్కజొన్న, ఉల్లి, మినుము పంటలు
జిల్లాలో 65 హెక్టార్లలో మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం
మైదుకూరులో మోటారు వేస్తుండగా షార్ట్ సర్కూట్‌తో రైతు మృతి
ప్రొద్దుటూరు క్రైం : భారీ వర్షాలకు కుందూ, పెన్నా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒక్కసారిగా నీటి ఉధృతి పెరగడంతో నది పరివాహక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొన్ని రోజుల క్రితం పెన్నా నదిలోకి వెళ్లిన వృద్ధ దంపతులు నీరు పెరగడంతో ఒడ్డుకు రాలేకపోయారు. నీళ్లలో చిక్కుకున్న వారిని రూరల్ పోలీసులు, అగ్నిమాపక రెస్క్యూ టీం సభ్యులు కాపాడారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు రూరల్ పోలీసులు నదీ పరివాహక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం రూరల్ సీఐ బాలమద్దిలేటి, ఎస్‌ఐ కేసీ రాజులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేశారు. పెన్నా నీటి ప్రవాహ సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా సూచనలు చేశారు. నీళ్లలో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా, నీటి ప్రవాహం ఎంత వరకు ఉందనే దానిపై కెమెరాల ద్వారా పరిశీలించారు. పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రామేశ్వరంలోని ఆర్టీపీపీ రహదారిలో రాకపోకలను నిలిపే శారు. ప్రజలు వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కనీస అవగాహన లేకుండా నీటి ప్రవాహంలో వెళ్లరాదని ప్రజలకు రూరల్ సీఐ బాలమద్దిలేటి సూచించారు.

పెన్నా ప్రాంతంలో డ్రోన్‌లతో పర్యవేక్షణ

పెన్నా ప్రాంతంలో డ్రోన్‌లతో పర్యవేక్షణ

పెన్నా ప్రాంతంలో డ్రోన్‌లతో పర్యవేక్షణ

పెన్నా ప్రాంతంలో డ్రోన్‌లతో పర్యవేక్షణ