
అంతర్జాతీయ సదస్సుకు వైవీయూ ఆచార్యుడికి ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వ విద్యాలయంలోని భూ విజ్ఞానశాస్త్ర విభాగంలో ఆచార్యుడిగా పనిచేస్తున్న ఎన్. జయరాజుకు యూకే లోని స్కాట్లాండ్ సెయింట్ ఆండ్రూస్ యూనివర్శిటీ నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. ఈ నెల 19 నుంచి 22 తేదీ వరకు జరిగే సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ‘భారతదేశ తూర్పు తీరంలోని కొ న్ని ప్రాంతాల నుంచి సముద్ర కాలుష్యాన్ని విశ్లేషించడానికి మలస్కన్ షెల్స్ వినియోగం’ అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించనున్నారు. ఈయనకు అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందడంపై వైవీయూ వైస్ చాన్స్‌లర్ అల్లం శ్రీనివాస రావు తదితరులు అభినందనలు తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలలో ఎమ్మెస్సీ ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సంచాలకులు టి.లక్ష్మి ప్రసాద్ తెలిపారు. ఈ కోర్సుల్లో పట్టభద్రులైన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తిగల విద్యార్థులు రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు 89855 97928, 99854 42196 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
వీఆర్‌ఏలతో భర్తీ చేయాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : తహసిల్దార్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అటెండర్, వాచ్మెన్, రికార్డ్ అసిస్టెంట్, పోస్టులను అర్హులైన వీఆర్‌ఏలతో భర్తీ చేయాలని ఏపీ వీఆర్‌ఏ వెల్ఫేర్ అండ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్మద్ది ఈశ్వరయ్య అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం నగరంలోని వీఆర్‌ఏ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చాలా ఏళ్ల నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల వీఆర్‌ఏలతో అనధికారికంగా డ్యూ టీలు చేయిస్తున్నారని తెలిపారు.ఈ విషయం ఇది వరకే జిల్లా అధికారులకు విన్నవించామని తెలిపారు. పోస్టులను భర్తీ చేయకపోవడంతో డ్యూటీ చేస్తున్న వీఆర్‌ఏలపై ఆర్థిక భారం పడుతోందన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య పాల్గొన్నారు.
డీ ఫార్మసీ ప్రవేశాలకు నేటితో గడువు పూర్తి
– ప్రిన్సిపల్ సీహెచ్ జ్యోతి
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి డి ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు 19వ తేదీతో గడువు ముగుస్తుందని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. ఈ ఫార్మసీ కోర్సు పూర్తి చేసిన వారికి వందశాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయ ని చెప్పారు. కోర్సులో ప్రవేశం పొంది రేషన్‌కార్డు, ఇన్‌కమ్ సర్టిఫికెట్ కలిగి ఉన్న పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందుతాయని తెలిపారు. ప్రవేశాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 94401 44057, 98853 55377 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.