కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి స్థాయిలో పరిష్కారం ఉండేలా చర్య లు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో అందిన పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని ఆదేశించారు. అనంతరం అర్జీదారుల నుంచి వారు అర్జీలను స్వీకరించారు.
కొన్ని ఫిర్యాదులు ఇలా..
● విచారణ చేయకుండానే వికలాంగుల పెన్షన్ రద్దు చేశారని, తనకు తిరిగి పెన్షన్ మంజూరు చేయగలరని కడప చెమ్ముమియాపేటకు చెందిన ఖలీల్ బాషా అర్జీ అందజేశారు.
● మైదుకూరు మండలం బొండ్లవరం గ్రామానికి చెందిన కె.నాగ మునయ్య తన భూమిలో ఫోర్జరీ పత్రాలతో ఇచ్చిన విద్యుత్ కనెక్షన్ తొలగించాలని విన్నవించారు.
● జమ్మలమడుగు బొమ్మేపల్లి గ్రామానికి చెందిన ఎం రెడ్డప్ప నాయక్ తనకు తల్లికి వందనం పథకం మంజూరు చేయగలరని కోరారు.
● తొండూరు మండలం మల్లెల గ్రామానికి చెందిన బి చంద్రశేఖర్ రెడ్డి గ్రామంలోని 4వ రేషన్ షాప్‌ను రద్దు చేసే మూడవ షాపుకు ఇవ్వాలని కోరారు.
సమర్థవంతంగా ‘ఆకాంక్షిత జిల్లా’ కార్యక్రమాలు
దేశంలోని వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయ డం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యమని, జిల్లాలో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్‌లో జిల్లాలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ విభాగాలలో దేశ వ్యాప్తంగా వైఎస్సార్ కడప జిల్లా ర్యాంకు 63గా ఉందని, ఏపీలో ఆస్పిరేషనల్ జిల్లాలైన వైఎస్సార్ కడప, పార్వతి పురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో మన జిల్లా 73.6 స్కోర్ తో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ప్రజల ఆరో గ్య సంరక్షణలో 35వ ర్యాంక్, విద్యలో 100, వ్యవసా యంలో 24, ఆర్థికాభివృద్ధిలో 71,మౌలిక సదు పాయాలలో 34వ ర్యాంక్ లో ఉన్నామని తెలిపారు. నీతి ఆయోగ్ వారు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ లో కనబరిచిన ఇండికేటర్స్ ఆధారంగా ఆయా శాఖ ల అధికారులు ఈ అంశం పై అవగాహన పెంచుకొ ని సరైన వివరాలను అందివ్వాలని ఆదేశించారు.