కడప కార్పొరేషన్/రాజంపేట : అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం ఆకేపాడుకు ఈనెల 19వ తేదీ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి సోదరుడి కుమారుడి వివాహ రిసెప్షనన్‌లో ఆయన పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు వైఎస్ జగన్ రాజంపేట మండలం బాలిరెడ్డిగారిపల్లె హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన ఆకేపాడు చేరుకుని, ఆకేపాటి ఎస్టేట్స్‌లో ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి సోదరుడు అనిల్‌కుమార్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.
హెలిప్యాడ్ పరిశీలన
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెంగళూరు నుంచి ఆకేపాడుకు చేరుకోనున్నారు. ఇందుకోసం హెలీప్యాడ్ సిద్ధం చేశారు. సోమవారం ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి హెలీప్యాడ్‌ను పరిశీలించారు.ఎమ్మెల్యే వెంట స్ధానిక వైఎస్సార్‌సీపీనేతలు పాల్గొన్నారు.
నేడు ఆకేపాడుకు వైఎస్ జగన్ రాక