
ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసేందుకే..
విద్యారంగంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రోజుకో సరికొత్త విధానం ఉపాధ్యాయులను బోధనకు దూరం చేయడమే. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా మూల్యాంకన పుస్తకం రూపొందించడం హంగు ఆర్బాటలకే తప్ప ప్రత్యేకంగా ఒనగూరేదేమి లేదు. బోధనకంటే మూల్యంకన పుస్తకం దిద్దటానికి, దానిని స్కాన్ చేయడానికి, ఇతర విషయాలు రాయటానికే సమయమంతా సరిపోతుంది. పాత విధానమే మెరుగ్గా ఉంది.
– మాదన విజయ కుమార్,
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా తీసుకువచ్చిన మూల్యాంకన పుస్తక విధానంతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే బోధనేతర పనులతో సతమతమవుతున్న ఉపాధ్యాయులపై మూల్యాంకన పుస్తకాలు ఇచ్చి అదనపు భారం మోపడం పద్ధతికాదు, ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ విధానాన్ని రద్దు చేయాలి. – సంగమేశ్వరరెడ్డి,
ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి.

ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసేందుకే..