
గీత కులాలకు మద్యం బార్ల కేటాయింపు
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో జిల్లాలోని రెండు బార్లను గీత కులాల వారికి లాటరీ పద్ధతిలో కేటాయించారు. సోమవారం కలెక్టరేట్‌లో కడప మునిసిపల్ కార్పొరేషకు సంబంధించి ’గౌడ్’ ఉపకులాలకు, ప్రొద్దుటూరు మునిసిపాలిటీ ’ఈడిగ’ ఉపకులాల వారికి లాటరీ ద్వారా కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజు, జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి రవి కుమార్, జిల్లా ఈడిగ సంఘం సెక్రటరీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.