
లారీ ఢీ కొని యువకుడి మృతి
చాపాడు : మైదుకూరు–ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని కేతవరం గ్రామ సమీంపలో సోమవారం లారీ ఢీ కొని మండలంలోని కేతవరం గ్రామానికి చెందిన ఎల్లనూరు సునీల్‌కుమార్(31)అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఎల్లనూరు ఓబయ్య, వీరమ్మ దంపతుల కుమారుడు సునీల్ కుమార్ ఉదయం 10గంటల సమయంలో కేఏ01ఏవీ 8756 నెంబరు గల బైక్‌లో మైదుకూరుకు వెళుతుండగా ప్రొద్దుటూరు వైపు నుంచి వస్తున్న టీఎల్ 88జే 2621 నెంబరు గల లారీ బైక్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో సునీల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై చాపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఐదుగురు బైక్ దొంగల అరెస్టు
జమ్మలమడుగు : బైకుల చోరీకి పాల్పడుతున్న ఐదుగురు యువకులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం స్థానిక అర్బన్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 10వతేదీన ప్రొద్దుటూరు రఽహదారిలో హోండా యాక్టివా చోరీకి గురైందంటూ బాధితుడు కొక్కొకోల రామమోహన్ ఫిర్యాదు చేశాడన్నారు. ఈ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా సోమవారం తమకు దొంగల సమాచారం అందిందన్నారు. ప్రొద్దుటూరు రోడ్డులోని ఎస్‌ఆర్ పెట్రోల్‌బంకు వద్ద సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐదుగురు యువకులు తమ సిబ్బందిని చూసి వాహనాలు వెనక్కి తిప్పుకుని వెళుతుండటంతో సిబ్బంది పట్టుకున్నారన్నారు. వారిని విచారించగా బైకుల దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి పది లక్షల రూపాయల విలువ గల 9 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో సీఐ లింగప్ప, ఎస్‌ఐ హైమావతి, దేవదాసు, రియాజ్, నాగేంద్ర, శివ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములు
పేదలకు పంచాలి
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను గుర్తించి అర్హులైన గ్రామీణ పేదలకు ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాలు వ్యవసాయ భూమిగా పంపిణీ చేయాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఓబయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఐదు వేల ఎకరాల భూమి కబ్జాకు గురైందని పేర్కొన్నారు. సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని కాపాడి అర్హులకు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జకరయ్య, రమణ, సీఆర్‌వీ ప్రసాద్, డబ్ల్యు రాము, ఆంజనేయులు, గంగయ్య, రామాంజనేయులు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

లారీ ఢీ కొని యువకుడి మృతి

లారీ ఢీ కొని యువకుడి మృతి