
జిల్లాలో 27 బార్లకు నోటిఫికేషన్ విడుదల
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లాలో 27 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు తెలిపారు. సోమవారం నగరంలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కడప కార్పొరేషన్ పరిధిలో–12, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో–7, బద్వేల్ మున్సిపాలిటీలో–2, మైదుకూరు మున్సిపాలిటీలో–1, పులివెందుల మున్సిపాలిటీలో–2, ఎర్రగుంట్ల నగర పంచాయతీ, కమలాపురం నగర పంచాయతీకి ఒక్కొక్కటి చొప్పున బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు రుసుం ఫీజు నాన్ రీఫండబుల్ రూ.5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలు కలిపి మొత్తం రూ. 5.10 లక్షలు చెల్లించాలన్నారు. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల దరఖాస్తు చేసుకోవాలన్నారు. 28న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీసి ఎంపిక చేస్తామన్నారు. ఒక బార్ కోసం నాలుగు లేదా అంతకు పైగా దరఖాస్తులు వస్తే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న వారు మొదటి వాయిదాను ఒక రోజులోనే చెల్లించాలన్నారు. బార్ నిర్ణీత గడువు 3 సంవత్సరాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ రవికుమార్ పాల్గొన్నారు.