
ప్రజా ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించే ఫిర్యాదులు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం’ నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన 149 మంది ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదుల గురించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఫిర్యాదులపై తీసుకున్న పరిష్కార చర్యలు, పూర్తి వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి అందజేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, మహిళా పీఎస్ డీఎస్పీ బాలస్వామిరెడ్డి, పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్