
ప్రవక్త జీవితంపై రాత పోటీ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్ : మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపైన సెప్టెంబర్ 21వ తేదీన రాత పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నామని కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎఫ్ ఎం ముక్తార్ అహ్మద్ తెలిపారు. ఆదివారం కడప నగరంలోని అఫ్సర్ కాలనీలో ఉన్న కార్యాలయంలో కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విశ్వ కారుణ్యమూర్తి ప్రవక్త మొహమ్మద్ (సల్లెల్లాహు అలైహి వసల్లం) వారి జీవిత చరిత్రపై నిర్వహించే రాత పరీక్ష పోటీలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు భాషలలో రాత పరీక్ష పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు. ఆన్‌లైన్ అప్లికేషన్ కోసంం http://Seerat.ciwskadapa.org/ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు సయ్యద్ హిదాయతుల్లా, ధర్మ పరిచయ కమిటీ డైరెక్టర్ సయ్యద్ అహ్మద్ బాబు భాయ్ తదితరులు పాల్గొన్నారు.