
రోడ్డుప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
గాయపడిన నజీర్‌ఖాన్, అమరనాథ్
మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమించిన ఘటన శనివారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. సీటీఎం పంచాయతీ నేతాజీకాలనీకి చెందిన నజీర్‌ఖాన్ (40) రైల్వేక్వార్టర్స్‌కు చెందిన అమరనాథ్ (38) వ్యక్తిగత పనులపై ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వచ్చారు. తిరిగి రాత్రి సీటీఎంకు వెళుతుండగా మార్గమధ్యలో శానిటోరియం వద్ద వేగంగా వెళ్లి ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను ఢీకొని, పక్కనే వస్తున్న కారుపై పడ్డారు. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితులను తిరుపతికి రెఫర్ చేశారు.

రోడ్డుప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు