
డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి
కడప ఎడ్యుకేషన్ : డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని వైఎస్సార్ కడప జిల్లా డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల ఫోరం జిల్లా కన్వీనర్ గుజ్జల తిరుపాల్ కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ కోసం ఈ నెల 25వ తేదీ విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం కడప ఎన్‌జీఓ భన్‌లో ఏపీ ఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు బి. శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి రవికుమార్, పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మోపూరి శివారెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్‌బాషా, ఏపీటీఎఫ్–1938 జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా, యూటీఎఫ్ జిల్లా కోశాధికారి నరసింహారావు, వైఎస్సార్‌టీఏ రాష్ట్ర నాయకుడు సజ్జల రమణారెడ్డి, ఏపీటీఎఫ్ 257 జిల్లా నాయకుడు రామచంద్రారెడ్డి, ఆపస్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, డీఎస్సీ 2003 ఫోరం జిల్లా కన్వీనర్లు ఉదయ భాస్కర్, వీరప్రతాప్, శోభారాణి తదితరులు మాట్లాడారు. ఫోరం జిల్లా కన్వీనర్ గుజ్జల తిరుపాల్,సుధాకర్, ప్రవీణ్‌కిరణ్, నాగేశ్వరెడ్డి, సునీత తదితరులు పాల్గొన్నారు.