
ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం
కడప కార్పొరేషన్ : కడప నగరం శంకరాపురంలో అంధుల పాఠశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను హైదరాబాద్‌కు చెందిన ఏఐజీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్, పద్మ విభూషణ్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసిన డాక్టర్ జి. రితేష్‌రెడ్డి, డాక్టర్ శ్రావ్యా రెడ్డిలకు అభినందనలు తెలిపారు. ఇక్కడ 24 గంటలు అందుబాటులో ఉండే వైద్య సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. మాధవరెడ్డి, డాక్టర్ శ్రీదేవి, కాంట్రాక్టర్ ఎం.నాగసుబ్బారెడ్డి, ఎం. మునిరెడ్డి, పలువురు వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.