
అధికారుల ఉదాసీనతే కారణం
ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల సందర్భంగా ఏ హోదా లేని టీడీపీ నాయకులు వేదికలను పంచుకున్నారు. ఇందుకు కలెక్టర్ మొదలు ఏ అధికారి అభ్యంతరం చెప్పలేదు. దీంతో తాను ఏం చేసినా చెల్లుతుందనే భావన నాయకుల్లో ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు ప్రొటోకాల్‌ను సమర్థవంతంగా అమలు చేస్తే ఇలాంటివి పునరావృతం కావు.
– కేసీ బాదుల్లా,
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కడప
అధికారుల వైఖరే కారణం
అధికారులు అధికారులుగా వ్యవహరించాలి. అలా కాకుండా అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. తాము ప్రజా సేవకులన్న విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు. బాధ్యతగల ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహారించడం అలవర్చుకోవాలి.
– సీఆర్‌వీ ప్రసాద్, జిల్లా కన్వీనర్,
హేతువాద సంఘం, కడప

అధికారుల ఉదాసీనతే కారణం