
వేడుకున్నా ఓటు వేయనివ్వలేదు.. ఇదో ఎన్నికా?
రాజంపేట రూరల్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో కూటమి ప్రభుత్వం నాయకులు ఎన్నికల నియమావళిని అభాసుపాలు చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక ఆకేపాటి భవన్‌లో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆకేపాటి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశ చరిత్రలో ఇటువంటి ఎన్నిక ఎక్కడా నిర్వహించలేదని మండిపడ్డారు. ఎన్నికల సంఘం, పోలీసు శాఖ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడంలో విఫలమయ్యాయన్నారు. అభ్యర్థి కూడా ఓటు వేసుకోకపోవడం ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదన్నారు. ఏజెంట్‌లను బూత్‌లలోకి రానివ్వకుండా జరిగిన ఏకై క ఎన్నికలు ఇవేనన్నారు. ఇతర నియోజకవర్గం నుంచి మనుషులు వచ్చి బూత్‌లు ఉన్న గ్రామాలలో షామియానాలు వేసుకొని జాతరను తలపించేలా చేస్తూ.. ఓటర్లను ఓటు వేసేందుకు పోనివ్వకుండా అడ్డుపడ్డారంటే వారికి పోలీసులు ఎంత సహకరించారో ఇట్టే అర్థం అవుతుందన్నారు.
ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి