
నాయకులతో సమాలోచనలు చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
జెడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయంపై వెఎస్సార్‌సీపీ వ్యూహ రచన
నేతలకు దిశానిర్దేశం చేసిన ఆ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఒంటిమిట్టలో నాయకులతో విస్తృతంగా చర్చలు
మరోవైపు జోరుగా ప్రచారం
సాక్షి రాయచోటి: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట ఆధ్యాత్మిక కేంద్రంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగుర వేసేందుకు ఆ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఒకపక్క ప్రచారంతోపాటు మరోపక్క ఓటు బ్యాంకు ఉన్న నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఇప్పటికే దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ నేతలకు.. విజయ బావుటా ఎగురవేసేందుకు అవసరమైన వ్యూహాన్ని వివరించారు.
ప్రస్తుత రోజులతోపాటు ఎన్నికల ముందు అనుసరించాల్సిన విధానాన్ని వివరించడంతోపాటు సమష్టిగా పని చేస్తూ.. ఒక పథకం ప్రకానం ముందుకు వెళితే విజయం తథ్యమని వివరిస్తూ వచ్చారు. కార్యకర్తలు, నాయకులు, నేతలు, శ్రేణులు ఒంటిమిట్ట వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని గెలిపించి వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయాలని సూచించారు. ఒంటిమిట్టలో జెడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డి అతిథి గృహం వద్ద రాష్ట్ర రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి నేతలతో చర్చించడంతోపాటు సమీక్షించి విజయానికి వ్యూహం రచించారు.
కొత్త మాధవరంలో ముమ్మరంగా ప్రచారం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒంటిమిట్ట జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున నేతలు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గురువారం రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు, కడప మేయర్ సురేష్ బాబు, కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.