
ఏసీఏ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నియామకం
కడప స్పోర్ట్స్: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2024–25 సీజన్‌కు సంబంధించి జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా వైఎస్సార్ జిల్లాకు చెందిన పైడికాల్వ విజయ్‌కుమార్‌ను నియమించారు. నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి జారీచేశారు. ఈ నియామకం ఏడాది పాటు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా పైడికాల్వ విజయ్‌కుమార్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పరిధిలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యథిక వికెట్లు తీసిన ఆంధ్రా బౌలర్‌గా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
ప్రశాంతంగా
పాలిసెట్ కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్: కడప నగర శివార్లలోని మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం నిర్వహించిన పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇందులో భాగంగా 27001 నుంచి 43 వేల మధ్య ర్యాంకులు వచ్చిన 137 మంది విద్యార్థులు హాజరై తమ సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకున్నారని పాలిసెట్ జిల్లా కో–ఆర్డినేటర్, ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. కౌన్సెలింగ్‌కు ఎలాంటి ఇబ్బందుల లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. గురువారం 43001 నుంచి 59000 వరకు ర్యాంకులు పొందిన విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లు, ర్యాంకుల పరిశీలన ఉంటుందని జ్యోతి తెలిపారు.

ఏసీఏ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నియామకం