కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన ఇంటర్ మ్యాథ్స్– బి,హిస్టరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం సెషన్‌లో 37 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షకు జనరల్‌కు సంబంధించి 8052 మందికి 7766 మంది హాజరుకాగా 286 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌కు సంబంధించి 469కి 441 మంది హాజరుకాగా 28 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో 22 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు జనరల్‌కు సంబంధించి 1675 మందికి 1581 మంది హాజరుకాగా 94 మంది గైర్హాజరయారు. ఒకేషనల్‌కు సంబంధించి 153 మందికి 145 మంది హాజరుకాగా 08 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్మీడియట్ ఆర్‌ఐవో బండి వెకంటసుబ్బయ్య తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్, టెక్నాలజీ(సీపెట్)డిప్లమో కోర్సులకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ డైరెక్టర్ అండ్ హెడ్ డాక్టర్ శేఖర్ తెలిపారు. 10వ తరగతి విద్యార్హతతో 3 సంవత్సరాల వ్యవధి గల డిప్లమో ఇన్ ప్టాస్టిక్స్ టెక్నాలజీ, డిప్లమో ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ(డీపీఎంటీ), బీఎస్సీ విద్యార్హతతో 2 సంవత్సరాల వ్యవధి గల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ ప్లాస్టిక్స్ పెరాసెస్సింగ్ అండ్ టెస్టింగ్ కోర్సులకు https://cipet24.online registrationform.org.cipet/ అనే లింక్ ద్వారా ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కోర్సులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయం ఉందని తెలిపారు. సీపెట్ అడ్మిషన్ టెస్టు జూన్ 9న నిర్వహించి అందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా విజయవాడ కేంద్రంలో 150 సీట్లను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు, ఇతర వివరాలకు శ్రీను సెల్ నంబర్ 6300147965లో సంప్రదించాలని శేఖర్ తెలిపారు.