నీరు, విద్యుత్‌ పొదుపుపై వ్యాసరచన పోటీలు | - | Sakshi
Sakshi News home page

నీరు, విద్యుత్‌ పొదుపుపై వ్యాసరచన పోటీలు

Nov 14 2026 7:51 AM | Updated on Nov 14 2026 7:51 AM

ఫ రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహణ

భువనగిరిటౌన్‌ : నీరు, విద్యుత్‌ పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇండియన్‌రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వ్యాసరచన, రీల్స్‌, షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా చైర్మన్‌ సద్ది వెంకటరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఎదురయ్యే నీటి కొరత, విద్యుత్‌ వినియోగ సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరిలో బాధ్యతాయుతమైన ఆలోచన పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘నీరు, విద్యుత్‌ పొదుపు నా బాధ్యత, రాష్ట్రాభివృద్ధిలో నా పాత్ర’ అనే అంశంపై తెలుగు లేదా ఇంగ్లిష్‌లో వ్యాసరచన చేసి పంపవచ్చని తెలిపారు. అలాగే నిమిషం నిడివి గల రీల్‌ లేదా షార్ట్‌ ఫిల్మ్‌లను రూపొందించి పంపవచ్చని సూచించారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పాటు మహిళా సంఘాల సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఉద్యోగులు, ప్రజలు ఈ పోటీల్లో పాలొనవచ్చన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న ఉత్తమ మూడు రచనలు, రీల్స్‌ విజేతలకు కలెక్టర్‌ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు తమ ఎంట్రీలను ఈ నెల 15వ తేదీలోపు వాట్సాప్‌ ద్వారా 9059969885, 7095458580, 9989960021, 9063870669 నంబర్లకు పంపించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement