అపాయింట్‌మెంట్ నుంచి రిపోర్టుల దాకా అరచేతిలోనే
వైద్యులు సూచించిన ల్యాబ్ పరీక్షల బిల్లుల కోసం లైన్లలో నిల్చోకుండా యాప్‌లోనే యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. ఆ డిజిటల్ రసీదును కౌంటర్ వద్ద చూపిస్తే సరిపోతుంది. అలాగే, పరీక్షల ఫలితాలు రాగానే రిపోర్టుల కోసం మళ్లీ ఆస్పత్రికి వెళ్లాల్సిన పనిలేకుండా యాప్ ద్వారానే నేరుగా చూసుకోవచ్చు, డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని రోగులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
సాక్షి, యాదాద్రి : బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆస్పత్రి రోగుల కష్టాలకు చెక్ పెడుతూ సరికొత్త డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. రోజురోజుకూ పెరుగుతున్న రద్దీతో రోగులు క్యూలైన్లలో పడుతున్న ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు ఎయిమ్స్ బీబీనగర్ స్వస్థ్య మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టింది. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పారదర్శకమైన, వేగవంతమైన వైద్య సేవలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
మొబైల్ నంబర్, ఓటీపీతో లాగిన్ అయి..
ప్రతిరోజూ వేలాది మంది రోగులు ఓపీ సేవల కోసం ఎయిమ్స్‌కు వస్తుండటంతో రిజిస్ట్రేషన్, ఫీజుల చెల్లింపుల వద్ద వృద్ధులు, మహిళలు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం లేకుండా ఈ యాప్‌లో మొబైల్ నంబర్, ఓటీపీతో లాగిన్ అయి ఆభా ఐడీ అనుసంధానంతో రోగి వివరాలను సులభంగా నమోదు చేసుకోవచ్చు. కొత్తవారైనా, పాత రోగులైనా తమకు కావాల్సిన విభాగాల్లో ముందస్తుగానే ఓపీ అపాయింట్‌మెంట్లను బుక్ చేసుకొని నిర్దేశిత సమయానికి నేరుగా వైద్యుడిని కలవొచ్చు.
విస్తరిస్తున్న వైద్య సదుపాయాలు
బీబీనగర్ ఎయిమ్స్‌లో ఓపీడీ, ఐపీడీ, ల్యాబ్ సేవలు గణనీయంగా పుంజుకున్నాయి. రోగుల సంఖ్య ఏటేటా భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం మౌలిక వసతులను మెరుగుపరుస్తోంది. గుండె జబ్బుల చికిత్సల కోసం క్యాథ్ ల్యాబ్, క్యాన్సర్ రోగుల రేడియేషన్ చికిత్స కోసం లీనియర్ యాక్సిలరేటర్, కచ్చితమైన రేడియేషన్ ప్లానింగ్ కోసం సీటీ సిమ్యులేటర్ లాంటి అధునాతన యంత్రాలను ఆస్పత్రిలో ఏర్పాటు చేసి పెద్దాస్పత్రులకు దీటుగా నాణ్యమైన చికిత్స అందిస్తున్నారు.
విభాగం / సంవత్సరం సంఖ్య
ఓపీడీ రోగులు (2020–21) 7,116
ఓపీడీ రోగులు (2025–26) 5,09,299
ఇప్పటివరకు మొత్తం ఓపీడీ రోగులు 19,83,121
సగటున రోజువారీ రోగులు 1,800
ఇన్–పేషెంట్లు (ఐపీ – 2025–26) 10,883
ఈ–సంజీవని టెలిమెడిసిన్ కన్సల్టేషన్లు 1,53,408
రోగ నిర్ధారణ పరీక్షలు (2019–20) 2,665
రోగ నిర్ధారణ పరీక్షలు (2025–26) 10,44,167
ఫ బీబీనగర్ ఎయిమ్స్‌లో క్యూలైన్ల తిప్పలు ఇక బంద్
ఫ అందుబాటులోకి ఎయిమ్స్ బీబీనగర్ స్వస్థ్య మొబైల్ యాప్
ఫ ఇంటి నుంచే ఓపీ అపాయింట్‌మెంట్, యూపీఐ ద్వారా ఫీజుల చెల్లింపులు
ఫ మళ్లీ ఆస్పత్రికి వెళ్లే పనిలేకుండా ల్యాబ్ రిపోర్టులు నేరుగా ఫోన్‌కే..
ఫ గుండె, క్యాన్సర్ వ్యాధుల చికిత్సలకు అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు


