పంటల నష్టంపై సర్వే | - | Sakshi
Sakshi News home page

పంటల నష్టంపై సర్వే

Nov 14 2026 7:51 AM | Updated on Nov 14 2026 7:51 AM

రామన్నపేట: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పత్తి, వరి పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పరిస్థితి తీవ్రతను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం.. జిల్లా మొత్తం కరువు ప్రాంతంగా ప్రకటించింది. రైతులను ఆదుకునేందుకు ఎండిన పంటలపై సమగ్ర సర్వే నిర్వహించి, ఈనెల 11వ తేదీలోగా నివేదికలు సమర్పించాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. అయితే, రెండు రోజులుగా సర్వే యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ఈ గడువు పొడిగించే అవకాశం ఉంది.

క్షేత్రస్థాయిలో ఏఈఓల సర్వే

ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓలు) క్షేత్రస్థాయిలో రైతుల పొలాల వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. 33 శాతానికి పైగా దెబ్బతిన్న పంటల ఫొటోలు తీసి.. రైతు పేరు, గ్రామం, సర్వే నంబర్‌, సాగు విస్తీర్ణం, ఎండిన పంట వివరాలను డిజిటల్‌ క్రాప్‌ నమోదుకు సంబంధించిన ‘క్రాప్‌ డ్యామేజీ యాప్‌’లో నమోదు చేస్తున్నారు.

ఇప్పటి వరకు 92,670 ఎకరాల్లో ఎండిన పంటలు

2026 వానాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2,26,323 ఎకరాల్లో వరి, 1,12,521 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వానలు లేక లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో రైతులు పెట్టిన కోట్లాది రూపాయల పెట్టుబడులు నష్టపోయారు. ఇప్పటివరకు జరిగిన సర్వేలో 92,670 ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో వరి 34,286 ఎకరాలు, పత్తి 56,634 ఎకరాలు, కందులు 1,750 ఎకరాలు ఉన్నాయి. సర్వే పూర్తయ్యే సరికి దెబ్బతిన్న విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకుంటుందని రైతులు ఎదురుచూస్తున్నారు.

వానాకాలం ఇప్పటి

సాగు వరకు గుర్తించిన

(ఎకరాల్లో) ఎండిన పంటలు

వరి 2,26,323 34,286

పత్తి 1,12,521 56,634

కందులు 16,412 1750

ఫ ఎల్‌నినో ప్రభావంతో ఎండిన వరి, పత్తి పంటలు

ఫ 33 శాతానికి పైగా నష్టం ఉన్న పొలాల్లో యాప్‌ ద్వారా సర్వే

ఫ సాంకేతిక సమస్యలతో నివేదికల గడువు పొడిగించే అవకాశం

ఫ పరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement