సమస్యలు పరిష్కరించేదాకా పోరు ఆగదు | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించేదాకా పోరు ఆగదు

Nov 14 2026 7:45 AM | Updated on Nov 14 2026 7:45 AM

భువనగిరిటౌన్‌ : నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేదాకా పోరాటం ఆగదని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కలెక్టర్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మెకు మంగళవారం ఐఎఫ్‌టీయూ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించకపోవడం దారుణమన్నారు. ఉద్యోగభద్రత కల్పించాలని, రాజ్యాంగ నిబంధనలు, న్యాయస్థానాల తీర్పుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రసూతి సెలవులు, ఆరోగ్య బీమా వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు. చాలీచాలని వేతనాలతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు ఊరడి రామచంద్రు, వడ్లకొండ నాగరాజు, డాక్టర్‌ మధు, ఎం.డి. కుమారన్‌, జె.రమేష్‌, రమాదేవి, జ్యోతి, కె.సుశీల, కె.సుధాకర్‌, జి.రమేష్‌, శ్రీలేఖ, జి.నాగరాజ్‌, కె.మురళి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement