బస్‌ డిపో సాధనకు కలిసికట్టుగా పోరాటం | - | Sakshi
Sakshi News home page

బస్‌ డిపో సాధనకు కలిసికట్టుగా పోరాటం

Nov 14 2026 7:45 AM | Updated on Nov 14 2026 7:45 AM

మోత్కూరు : బస్‌ డిపో సాధనకు కలిసికట్టుగా పోరాడాలని బస్‌ డిపో సాధన సమితి అడ్‌హక్‌ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఆర్యవైశ్య భవనంలో ఎర్రవెల్లి నర్సయ్య అధ్యక్షతన అన్ని రాజకీయ, కుల, ప్రజా సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బస్‌ డిపో లేకపోవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు తీపిరెడ్డి సోమిరెడ్డి, అవిశెట్టి అవిలుమల్లు, చేడె చంద్రయ్య, బయ్యని పిచ్చయ్య, కొణతం నాగార్జున్‌రెడ్డి, బయ్యని రాజు, చౌగోని సత్యం గౌడ్‌, చాపల అంజయ్య, తొగిటి మనోహరాచారి, మన్నె మల్లయ్య, ఏనుగు జితేందర్‌రెడ్డి, దామరోజు సత్యనారాయణ, గూదె మధుసూదన్‌ యాదవ్‌, అన్నెపు వెంకట్‌, పోచం సోమయ్య, కలిమెల నర్సయ్య, శివార్ల శ్రీనివాస్‌ యాదవ్‌, మెంట నగేష్‌, సజ్జనం మనోహర్‌, మెంట సురేష్‌, ఎడ్ల నరేష్‌, దాసరి తిరుమలేష్‌, బొమ్మగాని లక్ష్మయ్య, విజయ్‌రెడ్డి, బ్రహ్మచారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement