విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

సంస్థాన్‌ నారాయణపురం: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సూచించారు. గురువారం సంస్థాన్‌నారాయణపురం మండలంలోని సర్వేల్‌ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యాబోధన, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. తరగతి గదులు, వసతి గృహాలు, డిజిటల్‌ బోధనా విధానాన్ని పరిశీలించిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. డిజిటల్‌ స్క్రీన్‌పై పాఠాలు బోధించారు. పదో తరగతి విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ఇప్పటి నుంచే లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలన్నారు.

రాచకొండ అభివృద్దికి కృషి చేస్తా

రాచకొండ కోటను పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. రాచకొండ కోటను పరిశీలించి చారిత్రక నేపథ్యం, విశిష్టతను అడిగి తెలుసుకున్నారు.

ఫకలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement