ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ వివిధ గ్రామాలకు చెందిన 50 మందికి పైగా రైతులు గురువారం సర్వేల్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. అదే సమయంలో అటుగా సర్వేల్ గ్రామానికి వెళ్తున్న కలెక్టర్ అనురాగ్ జయంతి వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. పరిస్థితిని గమనించిన పోలీసులు కలుగజేసుకుని రైతులను సముదాయించారు. వారు వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. స్పందించిన కలెక్టర్.. పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కలెక్టర్ వెంట ఆర్డీ ఓ శేఖర్ రెడ్డి, డీఈఓ భిక్షపతి, తహసీల్దార్లు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ ప్రమోద్‌కుమార్, ప్రిన్సిపాల్ సతీష్ కుమార్, సర్పంచ్‌లు చిలకరాజు చందనరాజు, ఉప్పల విజయలక్ష్మి, పల్లె మల్లారెడ్డి, ఉప్పల నాగరాజు, రాచప్ప సమితి ప్రధాన కార్యదర్శి సూరపల్లి వెంకటేశం, ఎనుముల శంకర్‌రెడ్డి ఉన్నారు.


