కొనుగోలు కేంద్రాల్లో జాప్యం.. ఏపీకి తరలుతున్న ధాన్యం | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల్లో జాప్యం.. ఏపీకి తరలుతున్న ధాన్యం

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

రాజాపేట : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా, మిల్లుల అలాట్‌మెంట్‌ లేక కొనుగోళ్లు ఇంకా మొదలుకాలేదు. దీంతో నెల రోజులుగా ధాన్యం ఆరబోసుకుని ఎదురుచూస్తున్న రైతులు విసిగిపోయి ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఏ–గ్రేడ్‌ ధాన్యానికి రూ.1460 మద్దతు ధర ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోయింది. గత్యంతరం లేక రైతులు క్వింటా రూ.2300 చొప్పున దళారులకు అమ్ముకుంటున్నారు. పైగా వ్యాపారులు బస్తాకు 2 కిలోల తరుగు తీస్తూ రైతులను నష్టపరుస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏకంగా ఏపీకి తరలిస్తున్నారు. గురువారం ఏపీకి వెళ్తున్న అలాంటి ఒక లారీ ‘సాక్షి’ కంటపడింది. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement