పెద్దవూర : పేరు, ఇంటిపేరు ఒకటే కావడంతో మరొకరు తీసుకున్న రుణాల వివరాలు తన సిబిల్ రిపోర్టులో కనిపిస్తున్నాయని ఓ అంగన్వాడీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేస్తోంది. వివరాలు.. పెద్దవూర మండలం మల్లెవానికుంట తండాకు చెందిన రమావత్ పార్వతి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. సొంతింటి నిర్మాణం కోసం రుణం తీసుకోవాలని బుధవారం నాగార్జునసాగర్ పైలాన్‌కాలనీలోని ఎస్బీఐకి వెళ్లింది. ఆమె రుణ దరఖాస్తును పరిశీలించిన బ్యాకు మేనేజర్ ఇప్పటికే ఆమె పేరున రుణాలు ఉన్నాయని, సిబిల్ స్కోర్ సరిగా లేదని చెప్పాడు. అయితే తాను ఎలాంటి రుణం తీసుకోలేదని తెలిపిన పార్వతి తన బ్యాంకు ఖాతా నంబర్, ఆధార్ కార్డు, పాన్‌కార్డు తదితర వివరాలతో ఆరా తీయగా.. రామన్నగూడెం తండాకు చెందిన రమావత్ పార్వతి భర్త రమేశ్ పేరుతో ఉన్న రుణాల వివరాలు తన సిబిల్ రిపోర్టులో కనిపిస్తున్నట్లు ఆమె గుర్తించింది. ఇద్దరి పేర్లు, ఇంటి పేర్లు ఒకేలా ఉండటంతో ఈ సమస్య తలెత్తినట్లు మేనేజర్ వివరించారు.
రూ.8.38లక్షల రుణం..
తన సిబిల్ రిపోర్టులో రూ.8,38,600 గృహ రుణంతో పాటు వ్యాపార రుణం, పంట రుణం, కిసాన్ క్రెడిట్ కార్డు రుణాల వివరాలు కనిపిస్తున్నాయని పార్వతి తెలిపింది. తాను తీసుకోని రుణాల కారణంగా తన సిబిల్ స్కోర్ దెబ్బతిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. లిఖితపూర్వకంగా దరఖాస్తు చేస్తే ఉన్నతాధికారులతో చర్చించి తమ బ్యాంక్‌కు సంబంధించిన తప్పుడు నమోదులను సరిచేస్త్తామని బ్యాంక్ మేనేజర్ చెప్పినట్లు ఆమె తెలిపింది. ఈ వ్యవహారంపై పెద్దవూర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది.
ఫ ఇంటి రుణం కోసం బ్యాంక్‌కు వెళ్లిన అంగన్వాడీ కార్యకర్తకు షాక్
ఫ రూ.8లక్షల రుణం
తీసుకున్నట్లు సిబిల్లో నమోదు
ఫ న్యాయం చేయాలంటూ
పెద్దవూర పోలీసులకు ఫిర్యాదు


