ఫ భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు
నకిరేకల్ : బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో భర్త మృతిచెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నకిరేకల్ మండలం నెల్లిబండ గ్రామ శివారులో మంగళవారం రాత్రి జరిగింది. నకిరేకల్ మండలం చందంపల్లికి చెందిన దార రాంబాబు (29) తుంగతుర్తిలో మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి తన భార్య మహేశ్వరితో కలిసి బైక్‌పై స్వగ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యలో నకిరేకల్ మండలం నెల్లిబండ శివారులోని 365వ నంబర్ జాతీయ రహదారి క్రాస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాంబాబు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మహేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌లో వారిని నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహేశ్వరిని వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి దార కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హరిబాబు తెలిపారు. రాంబాబు మృతదేహానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం నివాళులర్పించారు.


