రైతు వ్యతిరేక విధానాలపై కలం ఎక్కుపెట్టాలి | - | Sakshi
Sakshi News home page

రైతు వ్యతిరేక విధానాలపై కలం ఎక్కుపెట్టాలి

Nov 12 2026 5:30 AM | Updated on Nov 12 2026 5:30 AM

రామగిరి (నల్లగొండ): రైతాంగ సంక్షేమాన్ని విస్మరించి, కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న పాలకుల రైతు వ్యతిరేక విధానాలపై కవులు తమ కలాలను ఎక్కుపెట్టాలని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నందిని సిధారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నల్లగొండలోని టీఎన్‌జీఓ భవన్‌లో ‘రైతు జనకవనం’ కవి, గాయ క సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి ప్రభుత్వాలు ద్రోహానికి ఒడిగట్టాయని ధ్వజమెత్తారు. సాయుధ పోరాటాల గడ్డ అయిన తెలంగాణలో నాటి భూస్వాముల స్థానంలో నేడు కార్పొరేట్‌ పెట్టుబడిదారులు వచ్చి భూములను బలిగొంటున్నారన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే సామర్థ్యం కూడా ప్రభుత్వాలకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. కవులు అట్టడుగు వర్గాల పక్షాన నిలిచి, రైతాంగ పోరాటాలకు బాసటగా నిలవాలని కోరారు. భూ సంస్కరణల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. భూ కేంద్రీకరణను అరికట్టి భూ సంస్కరణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసినప్పుడే పేదలందరికీ భూమి లభిస్తుందన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల కోసం నేటికీ రైతులు పోరాడాల్సి రావడం విచారకరమని, రైతు ఉద్యమాలు దేశ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కే. ఆనందాచారి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, మేరెడ్డి యాదగిరిరెడ్డి, కట్ట నరసింహ, వేముల ఆనంద్‌, సలీమ, పుప్పాల కృష్ణమూర్తి, బైరెడ్డి కృష్ణారెడ్డి, మునాసు వెంకట్‌, తండు కృష్ణకౌండిన్య, పగడాల నాగేందర్‌, వురిమల్ల సునంద, కాక మంజన్న పాల్గొన్నారు.

ఫ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నందిని సిధారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement