సంస్థాన్ నారాయణపురం: ప్రస్తుత దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు గతంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో పదో తరగతి విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ‘విద్యార్థి ఇంటి తలుపు తట్టే కార్యక్రమం’, ‘వేకప్ కాల్’ కా ర్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాలగూడెం జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతున్న భరత్‌చంద్రచారి కుటుంబ పరిస్థితులను కలెక్టర్ అడిగి తెలుసుకుని అతడిని దత్తత తీసుకున్నారు. అతడి చదువు, కుటుంబ పోషణకు అండగా నిలిచారు. అప్పటి నుంచి నిత్యావసర సరుకులతో పాటు ప్రతినెలా ఆర్థిక సహా యం అందిస్తున్నారు. ప్రస్తుతం భరత్ ఇంటర్మీ డియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఆప్యాయంగా పలకరించి..
బుధవారం కంకణాలగూడేనికి వచ్చిన కమిషనర్ హనుమంతరావు.. భరత్‌ను కలిసి ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా పలకరించారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చదువు ఎలా సాగుతోందని ఆరా తీశారు. భరత్ కుటుంబానికి మూడు నెలలకు సరిపడా బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఖర్చుల నిమిత్తం రూ.20వేల సాయం చేశారు. భరత్ కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని తహసీల్దార్‌ను కోరారు. ఆయన వెంట తహసీల్ద్థార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ పాండు, సర్పంచ్ వీరేశం తదితరులున్నారు.
ఫ దత్తత తీసుకున్న విద్యార్థిని
ఆప్యాయంగా పలకరించిన దేవాదాయ శాఖ కమిషనర్
హనుమంతరావు
ఫ నిత్యావసర సరుకులు,
ఆర్థిక సాయం అందజేత


