ఆదర్శ విద్యార్థి ఆవిష్కరణ జాతీయస్థాయికి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ విద్యార్థి ఆవిష్కరణ జాతీయస్థాయికి ఎంపిక

Nov 12 2026 5:30 AM | Updated on Nov 12 2026 5:30 AM

నిడమనూరు : నిడమనూరు ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి కె. వెంకట్‌ రూపొందించిన క్వాడ్రినల్‌ ఏరియా మెజర్‌మెంట్‌ పరికరం 53వ జాతీయ బాల వైజ్ఞానిక–2026 ప్రదర్శనకు ఎంపికై ంది. ఎన్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 14 నుంచి 19 వరకు పుదుచ్చేరిలో జరిగే ఈ జాతీయస్థాయి ప్రదర్శనకు 202 ఆవిష్కరణలు ఎంపిక కాగా.. తెలంగాణ నుంచి తొమ్మిది ఆవిష్కరణలకు చోటు దక్కింది. అందులో వెంకట్‌ ఆవిష్కరించిన క్వాడ్రినల్‌ ఏరియా మెజర్‌మెంట్‌ పరికరం కూడా ఉంది. పాఠశాల సైన్స్‌ ఉపాధ్యాయుడు వలసాని సైదులు మార్గదర్శకత్వంలో రూ.1500తో వెంకట్‌ ఈ పరికరాన్ని రూపొందించాడు. ప్రస్తుతం ప్రభుత్వం భూముల రీసర్వే చేస్తున్న రోవర్‌ పరికరం కంటే అత్యంత కచ్చితత్వంతో క్వాడ్రినల్‌ ఏరియా మెజర్‌మెంట్‌ పరికరం కొలుస్తుందని ఉపాధ్యాయుడు సైదులు పేర్కొన్నారు. ఈ పరికరాన్ని వెంకట్‌ జిల్లా, రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలోనూ ప్రదర్శించి అభినందనలు అందుకున్నారు. తమ పాఠశాల విద్యార్థి రూపొందించిన ఎగ్జిబిట్‌ జాతీయస్థాయికి ఎంపికవ్వడం సంతోషంగా ఉందని ప్రిన్సిపాల్‌ బి. నిర్మల తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement