తప్పుడు సమాచారంతో భూమి రిజిస్ట్రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

తప్పుడు సమాచారంతో భూమి రిజిస్ట్రేషన్‌

Nov 12 2026 5:30 AM | Updated on Nov 12 2026 5:30 AM

హుజూర్‌నగర్‌ : తప్పుడు హామీ పత్రం సమర్పించి ప్రభుత్వ భూమిని ఓ ఫైనాన్షియర్‌ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించిన నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువుకు చెందిన భువనగిరి సామ్రాజ్యం తన పేరు మీద ఏమైనా భూములు ఉన్నాయా కనుక్కో అని పక్కింటి వ్యక్తి పసుపులేటి రామారావుకు కోరింది. ఆయన వివరాలు సేకరించి సామ్రాజ్యం పేరుమీద హుజూర్‌నగర్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 458లో 9 ఎకరాల 16 గుంటల ఉందని తెలుసుకున్నాడు. ఆ భూమిని 1971లోనే ప్రభుత్వం ఎన్‌ఎస్‌పీ కాలువల కోసం సేకరించిందని కానీ రెవెన్యూ రికార్డులలో తొలగించలేదని చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి ఆ భూమిని అమ్మకానికి తెరతీశారు. ఈ క్రమంలో 2026 జూలైలో ఆ భూమిని కొనేందుకు రామారావు ద్వారా శేషం రవి, బేత వెంకటరెడ్డి, కన్నె కొండల్‌రావు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు కలిసి సామ్రాజ్యం వద్దకు వచ్చారు. ఎకరం రూ.3లక్షల చొప్పున ఇచ్చేటట్లు, కన్నె కొండలరావు పేరున అగ్రిమెంట్‌ చేయించుకున్నారు. తన పేరు మీద భూమి ఉండి పొజిషన్‌లో లేకున్నా ఆ భూమిని అమ్మడం నేరమని తెలిసినా రామారావు సలహా మేరకు సామ్రాజ్యం అమ్మకానికి ఒప్పుకుంది. తప్పడు ఒప్పంద పత్రాలను రెవెన్యూ అధికారులకు సమర్పించి ఆ భూమిని హైదరాబాద్‌కు చెందిన కనుమూరి కళ్యాణ్‌కుమార్‌ పేరుపై రిజిస్త్రేషన్‌ చేయించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన హుజూర్‌నగర్‌ ఎస్‌ఐ నరేష్‌ దర్యాప్తు చేపట్టారు. సామ్రాజ్యానికి నోటీసులు జారీ చేసి, ప్రధాన నిందితులైన పసుపులేటి రామారావు, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, కన్నె కొండలరావు, బేత వెంకటరెడ్డి, శేషం రవిలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ చరమందరాజు, ఎస్‌ఐలు నరేష్‌, హనుమాన్‌నాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఫ ఐదుగురి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement