మద్యం మత్తులో స్కూల్‌ బస్సు నడిపిన డ్రైవర్‌ | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో స్కూల్‌ బస్సు నడిపిన డ్రైవర్‌

Nov 12 2026 5:30 AM | Updated on Nov 12 2026 5:30 AM

మోత్కూరు : మద్యం మత్తులో స్కూల్‌ బస్సు నడిపిన డ్రైవర్‌ను స్థానికులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మోత్కూరులో బుధవారం ఉదయం జరిగింది. మోత్కూరులోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌కు చెందిన బస్సు డ్రైవర్‌ నాగరాజు బుధవారం ఉదయం దుప్పల్లి, దత్తప్పగూడెం, ముశిపట్ల, రాగిబావి, పనకబండ గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్నాడు. అయితే డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు గమనించిన స్థానికులు మోత్కూరు జ్యోతిరావు పూలే చౌరస్తా వద్ద బస్సును అడ్డుకొని డ్రైవర్‌ను నిలదీశారు. ప్రతిరోజు డ్రైవర్‌ మద్యం సేవించి వస్తున్నాడని విద్యార్థులు చెప్పినట్లు సమాచారం. విద్యార్థుల భద్రతను పర్యవేక్షించాల్సిన ముగ్గురు ఉపాధ్యాయులు, కేర్‌ టేకర్‌ సైతం బస్సులో ఉన్నప్పటికీ డ్రైవర్‌ వ్యవహారాన్ని గుర్తించకపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం అక్కడికి చేరుకొని డ్రైవర్‌ను కిందకు దించి మరో డ్రైవర్‌తో విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి బ్రీత్‌ అనలైజర్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మీటర్‌పై 100 రీడింగ్‌ నమోదైందని ఎస్‌ఐ సతీష్‌ వెల్లడించారు. డ్రైవర్ల నియామకానికి ముందు వారి అర్హతలు, అలవాట్లను పరిశీలించడంలో స్కూల్‌ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement