రోజూ గంట మాత్రమే సరఫరా | - | Sakshi
Sakshi News home page

రోజూ గంట మాత్రమే సరఫరా

Nov 12 2026 5:24 AM | Updated on Nov 12 2026 5:24 AM

ప్రతిరోజు నీరు సరఫరా చేస్తున్నాం

నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వద్దు

భువనగిరి : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం చేయవద్దని డీఈఓ భిక్షపతి పేర్కొన్నారు. బుధవారం భువనగిరి మండలం అనాజీపురం గ్రామంలోని జెడ్పీ ఉన్నత , ప్రాథమిక పాఠశాలల్లో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ స్వాతితో కలిసి ఆహార పదార్థాలు, వంటగదిని తనిఖీ చేశారు. ఆహారపదార్థాల శాంపిల్స్‌ సేకరించారు.ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడారు. వంటగది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

ఆలేరు రూరల్‌: ఆలేరు మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. నిరంతరం నీరు అందించాల్సిన పాలకవర్గం, సరఫరాను రోజుకు కేవలం గంటకే పరిమితం చేసింది. కాగితాలపై వసతులు ఘనంగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ప్రజల దాహం తీరడం లేదు.

నీటి కొరత ఇలా..

పట్టణ ప్రజల అవసరాలకు ప్రతిరోజూ 2.20 ఎంఎల్‌డీల (22 లక్షల లీటర్లు) నీరు అవసరం. కానీ, మిషన్‌ భగీరథ గ్రిడ్‌ ద్వారా 1.55 ఎంఎల్‌డీల నీరు మాత్రమే వస్తోంది. దీంతో రోజూ 0.65 ఎంఎల్‌డీల నీటి కొరత ఏర్పడుతోంది. ఆలేరు పరిధిలోని 12 వార్డుల్లో 4,890 గృహాలు ఉండగా, 3,665 ఇళ్లకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఉన్నాయి. బహిరంగ కుళాయిలు, చేతిపంపులు లేకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తోంది.

నిల్వ సామర్థ్యం ఉన్నా..

నీటి లోటును భర్తీ చేసేందుకు మున్సిపాలిటీకి చెందిన 43 బోర్లు, లీజుకు తీసుకున్న మరో 8.. వెరసి మొత్తం 51 బోర్లను వినియోగిస్తున్నారు. అలాగే 20 ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, 4 గ్రౌండ్‌ లెవల్‌ రిజర్వాయర్లు కలుపుకొని మొత్తం 1,475 కిలోలీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న 24 కేంద్రాలు ఉన్నాయి. ఇన్ని బోర్లు, ట్యాంకులు ఉన్నప్పటికీ గంటసేపే నీరు రావడం సరఫరా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతోంది. అత్యవసరాల కోసం కేవలం రెండు మున్సి పల్‌ ట్యాంకర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఫ రూ. 123.98 కోట్లతో కాలువ విస్తరణ, స్ట్రక్చర్ల నిర్మాణం

ఫ డిసెంబర్‌ మొదటివారంలో నీటి విడుదలకు సన్నాహాలు

ఫ ఆలేరు పట్టణానికి 2.20 ఎంఎల్‌డీల నీరు అవసరం.. వస్తున్నది 1.55 ఎంఎల్‌డీలే

ఫ మున్సిపాలిటీలో రోజూ 0.65 ఎంఎల్‌డీల నీటి కొరత

ఫ 51 బోర్లు, 24 ట్యాంకులున్నా తీరని ప్రజల దాహం

ఆలేరు మున్సిపాలిటీలో ప్రజల తాగునీటి అవసరాలకు అనుగుణంగా రోజూ నీటి సరఫరా చేస్తున్నాం. మిషన్‌ భగీరథ ద్వారా వచ్చే నీటికి అదనంగా మున్సిపల్‌ బోర్ల ద్వారా కొరతను భర్తీ చేస్తున్నాం. ప్రస్తుతం రెండు ట్యాంకర్లు ద్వారా అవసరమైన ప్రాంతాలకు నీటిని అందిస్తున్నాం. తాగునీటి సమస్యలు తలెత్తకుండా అదనపు నీటి వనరుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.

–శ్రీనివాస్‌రెడ్డి, ఆలేరు మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement