పారదర్శకంగా భూముల రీసర్వే పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా భూముల రీసర్వే పూర్తి చేయాలి

Nov 12 2026 5:24 AM | Updated on Nov 12 2026 5:24 AM

ఫ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి

భువనగిరిటౌన్‌ : రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియను ప్రజలకు మేలు జరిగేలా, సానుకూల వాతావరణంలో పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి రెవెన్యూ శాఖ కార్యదర్శి డీ ఎస్‌ లోకేష్‌ కుమార్‌, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో భూముల రీసర్వే ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌లో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకా రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఆర్డీఓలు కృష్ణా రెడ్డి, శేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వయోవృద్ధులకు న్యాయ సేవలు అందిస్తాం

భువనగిరి: వయోవృద్ధులకు అవసరమైన న్యాయ సేవలు అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత తెలిపారు.బుధవారం భువనగిరి మండలం చీమలకొండూరులోని బెజ్జా లక్ష్మయ్య ఫౌండేషన్‌ వయోవృద్ధుల ఆశ్రమాన్ని ఆమె సందర్శించి మాట్లాడారు. వయోవృద్ధులు ఒంటరి వారు కారని వారికి రాజ్యాంగం ప్రత్యేకంగా హక్కులు కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ ఇన్‌చార్జి, వృద్ధులు ఉన్నారు.

సీఎంను కలిసిన ఎమ్మెల్యే కుంభం

భువనగిరిటౌన్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో బుధవారం భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని తాజా రాజకీయ పరిస్థితులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, నియోజకవర్గ అభివృద్ధికి తగిన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

పోటీలకు సిద్ధంగా ఎంజీయూ ఇండోర్‌ స్టేడియం

నల్లగొండ టూటౌన్‌ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సిద్ధంగా ఉందని ఎంజీయూ స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ మద్దిలేటి పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో తెలంగాణ స్పోర్ట్స్‌ ఆఫ్‌ అథారిటీ చైర్మన్‌ శివనాగిరెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వాణి ప్రసాద్‌, వైస్‌ చైర్మన్‌ సోనిబాలను కలిసి ఇండోర్‌ స్టేడియం వివరాలు సమర్పించారు. ప్రభుత్వం చేపట్టబోయే వివిధ క్రీడా పోటీలకు ఎంజీయూలోని మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియం ఉపయోగించుకోవాలని కోరారు.

యాదగిరిక్షేత్రంలోసంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నిత్య పూజలను బుధవారం నిర్వహించారు. వేకువజామునే సుప్రభాత సేవ చేపట్టారు. స్వయంభువులు, ప్రతిష్ఠాఅలంకార మూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాలభోగం, సహస్రనామార్చన పూజలు చేశారు. ప్రధానాలయ ముఖమండపంలో ఉన్న ఉత్సవ మూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాకార మండపాల్లో నిత్యకల్యాణం, శ్రీ సుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలు చేపట్టారు. సాయంత్రం తిరుమాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. రాత్రి స్వామి అమ్మవార్లకు శయనోత్సవం జరిపించి, ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement