భూదాన్‌పోచంపల్లి: ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం రైతుసంఘం ఆధ్వర్యంలో భూదాన్‌పోచంపల్లి పట్టణంలోని నేతాజీ చౌరస్తాలో రైతులు గంట సేపు రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. విషయం తెలుసుకొన్న తహసీల్దార్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. వెంటనే కాంటాలు ప్రారంభించి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయకార్యదర్శి కోట రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ కాంటాల జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దుబ్బాక జగన్, మంచాల మధు, కంటె రాములు, సుధాకర్‌రెడ్డి, యాదిరెడ్డి, ఎల్లారెడ్డి, జంగయ్య, భిక్షపతి, మల్లారెడ్డి, కృష్ణారెడ్డి, శేఖర్, రాంరెడ్డి, వడ్డేపల్లి యాదగిరి, వెంకట్‌రెడ్డి, ప్రకాశ్, భూషయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


