ఫ నేటి నుంచి కొత్త పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ
ఫ జిల్లా వ్యాప్తంగా 13736 దరఖాస్తుల ఆమోదం
సాక్షి, యాదాద్రి : చేయూత పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. అర్హులైన వారికి ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈమేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీని కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో మొత్తం దరఖాస్తులు 17480
జిల్లాలో చేయూత కొత్త పింఛన్ల కోసం మొత్తం 17480 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వికలాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులు ఫైలేరియా, లెప్రసీ బాధితులు, వితంతువులు ఉన్నారు. కాగా 14,634 దరఖాస్తులకు అర్హత ఉండగా, 2766 అనర్హతగా అధికారులు తేల్చారు. 80 దరఖాస్తులను హోల్డ్‌లో పెట్టారు. మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓల స్థాయిలో 13,999 దరఖాస్తులను అనుమతించి 2,687 దరఖాస్తులను రిజెక్ట్ చేశారు. 714 దరఖాస్తులను పెండింగ్‌లోఉంచారు. కాగా చేనేత, ఎకై ్సజ్ శాఖల అధికారుల పరిధిలో 263 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. డీఆర్‌డీఓ స్థాయిలో 13736 పింఛన్లను మంజూరు చేశారు.


