బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఒకరికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఒకరికి తీవ్ర గాయాలు

Nov 11 2026 9:22 AM | Updated on Nov 11 2026 9:22 AM

మోత్కూరు : మోత్కూరు మండలంలోని పాటిమట్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అజాగ్రత్తగా, అతివేగంగా వచ్చిన అశోక్‌ లేలాండ్‌ డీసీఎం వాహనం రోడ్డు పక్కన ఆపి ఉన్న గ్లామర్‌ బైక్‌ను ఢీకొనడంతో, పక్కనే కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాటిమట్ల గ్రామానికి చెందిన కురిమేటి యాదగిరి తన గ్లామర్‌ బైక్‌ను జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలో నిలిపి ఇంట్లోకి వెళ్లాడు. అదే సమయంలో బైక్‌ పక్కన ఎడవెల్లి సాగర్‌ కూర్చుని ఉన్నాడు. ఈ క్రమంలో పాటిమట్ల ఎక్స్‌రోడ్డు వైపు నుంచి అతివేగంగా వచ్చిన అశోక్‌ లేలాండ్‌ ట్రాలీ వాహనం ఆగి ఉన్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌ పక్కనే ఉన్న సాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. బైక్‌ ట్రాలీ వాహనం ముందు భాగంలో ఇరుక్కున్నప్పటికీ డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా సుమారు 7 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. గమనించిన స్థానికులు మోత్కూరు చెరువు కట్ట వద్ద అడ్డుకోవడంతో వాహనాన్ని నిలిపివేసి డ్రైవర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. డ్రైవర్‌ విపరీతంగా మద్యం సేవించి ఉన్నాడని స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. వాహనాన్ని నడిపిన డ్రైవర్‌ మోత్కూరుకు చెందిన పోచం సత్యనారాయణగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. బైక్‌ యజమాని కురుమేటి యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement