దొంగతనాలకు పాల్పడుతున్న విద్యార్థి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

దొంగతనాలకు పాల్పడుతున్న విద్యార్థి అరెస్ట్‌

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

హుజూర్‌నగర్‌: చెడు వ్యసనాలకు బానిసై అప్పులు చేసి, వాటిని తీర్చేందుకు దొంగతనాలకు పాల్పడుతున్న విద్యార్థిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి రూ.1.80 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం హుజూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు. హుజూర్‌నగర్‌ పట్టణంలోని కనకదుర్గమ్మ గుడి బజార్‌కు చెందిన మల్లెబోయిన నిఖిల్‌(19) చిన్నతనం నుంచి తన అమ్మమ్మ, తాతయ్య కోడి ఉమ, జనార్ధన్‌ వద్ద ఉంటూ పెరిగాడు. ప్రస్తుతం కోదాడలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటుపడి గత రెండేళ్లుగా మైనర్‌ అయిన తన క్లాస్‌మేట్‌తో కలిసి కోడి పందాలు కాస్తూ పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాడు. అప్పులు తీర్చేందుకు మళ్లీ కోడిపందాలు ఆడి మరింత అప్పులపాలయ్యాడు. వాటిని తీర్చలేక దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం నిఖిల్‌ తన అమ్మమ్మ కోడి ఉమాకు చెందిన బంగారు గొలుసును చోరీ చేసి, తన స్నేహితుడితో కలిసి కొంత భాగాన్ని విక్రయించి జల్సాలు చేశాడు. మళ్లీ ఈ నెల 3న మేనత్త కోడి ఉపేంద్రకు చెందిన మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడును నిఖిల్‌ దొంగిలించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులను చూసి పారిపోతున్న నిఖిల్‌, అతడి స్నేహితుడిని ఎస్‌ఐ నరేష్‌ పట్టుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించడంతో.. వారి నుంచి తులం కరిగించిన బంగారు ముద్ద, మూడున్నర తులాల పుస్తెలతాడును స్వాధీనం చేసుకుని నిఖిల్‌ను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ చరమందరాజు, ఎస్‌ఐ నరేష్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

రూ.1.80 లక్షల విలువైన

బంగారు ఆభరణాలు స్వాధీనం

రిమాండ్‌కు తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement