కోదాడ పశువైద్యశాల సేవలు రాష్ట్రానికే ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

కోదాడ పశువైద్యశాల సేవలు రాష్ట్రానికే ఆదర్శం

Nov 7 2026 1:42 AM | Updated on Nov 7 2026 1:42 AM

కోదాడ(కోదాడరూరల్‌) : కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో మూగజీవాలకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పశువైద్య, పశు సంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్‌ డాక్టర్‌ బి. సుబ్బారాయుడు ప్రశంసించారు. శుక్రవారం ఆయన కోదాడ పశువైద్యశాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ అందిస్తున్న వినూత్న చికిత్సలు, శస్త్రచికిత్సల కోసం పొరుగు జిల్లాలు, ఏపీ నుంచి కూడా పశువులను తీసుకురావడం డాక్టర్‌ పెంటయ్య పనితనానికి నిదర్శనమన్నారు. దేశంలోనే తొలిసారిగా కోదాడలో పశు ఔషధ బ్యాంకును ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. డాక్టర్‌ పెంటయ్యను ఆదర్శంగా తీసుకుని పశు వైద్యులంతా మూగజీవాలకు సేవలందించాలని సూచించారు. అనంతరం పశువైద్యశాల సిబ్బందిని ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సిరిపురపు సురేంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక శాఖ

అదనపు డైరెక్టర్‌ సుబ్బారాయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement