● జాతీయ పోటీలకు ఎంపిక
భూదాన్‌పోచంపల్లి: మండలంలోని పెద్దరావులపల్లికి చెందిన తప్పెట పవన్‌కుమార్ హైదరాబాద్‌లో జరుగుతున్న రాష్ట్ర 70వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్–17 పోటీలలో సత్తా చాటాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సిల్వర్ మెడల్ కైవసం చేసుకుని ఈ నెల 23 నుంచి 26 వరకు గోవాలో జరగనున్న స్కూల్ గేమ్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అంతేకాకుండా, వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరిగే ఖేలో ఇండియా పోటీల్లో 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. సెప్టెంబర్‌లో కేరళలోని తిరువనంతపురంలో జరిగిన 17వ సౌత్‌జోన్ పోటీల్లోనూ తెలంగాణ తరఫున పాల్గొని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ పోటీలకు అర్హత సాధించాడు. పవన్‌కుమార్ పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీజీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పవన్‌కుమార్‌ను కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్‌రెడ్డి, అధ్యాపకులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.
విద్యుదాఘాతంతో మహిళ మృతి
కోదాడ(కోదాడ రూరల్) : ఇల్లు శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతిచెందింది. ఈ ఘటన కోదాడ మండలం బీక్యాతండాలో శుక్రవారం జరిగింది. బీక్యాతండాకు చెందిన బాణోతు జ్యోతిబాయి(32) ఇల్లు శుభ్రం చేస్తుండగా.. తలుపుపై ఉన్న కూలర్ వైరు ప్రమాదవశాత్తు ఆమైపె పడింది. ఆ వైరుకు జాయింట్లు ఉండటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. కోదాడ రూరల్ పోలీసులు తండాకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


