క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

భువనగిరి : క్రీడలతో పిల్లల్లో ఆత్మవిశ్వాసంతోపాటు ఐక్యత, స్నేహభావం పెంపొందుతాయని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. శుక్రవారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో భవిత కేంద్రాల్లోని మానసిక వికలాంగుల పిల్లలకు చేపట్టిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రత్యేక అవసరాల గల పిల్లలు ఇతర పిల్లలతో సమానంగా చదువుకోవడంతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. భవిత కేంద్రాల్లో పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంచాలన్నారు. పారా ఒలింపిక్స్‌లో రాణించిన క్రీడాకారుల వీరగాథలను వీడియోల ద్వారా పిల్లలకు చూపించాలన్నారు. పోటీల్లో విజేతలైన వారికి కలెక్టర్‌ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, సమ్మిళిత విద్యా సమన్వయ కర్త పెసరు లింగారెడ్డి, ఎంఈఓ రంగరాజ్‌, ప్రధానోపాధ్యాయులుఎన్‌.అండాలు, ప్రత్యేక ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్‌ పనులు వేగంగా పూర్తిచేయండి

భువనగిరిటౌన్‌ : పీఎంశ్రీ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు వీడియో కాన్ఫరెనన్స్‌ నిర్వహించి వివిధ అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో ఇంకుడు గుంతలు, బోర్‌ వెల్‌ రీఛార్జ్‌ నిర్మాణాలు, పంట కుంటల తవ్వకాలపై దష్టి పెట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, డీఈఓ భిక్షపతి పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement