ఏఐ సహకారంతో ఇక్కత్‌ వస్త్రాల ఉత్పత్తి | - | Sakshi
Sakshi News home page

ఏఐ సహకారంతో ఇక్కత్‌ వస్త్రాల ఉత్పత్తి

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

రామన్నపేట : ఇక్కత్‌ వస్త్రాలు, చేనేత డిజైన్ల రూపకల్పనలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలీజెన్స్‌ (ఏఐ) సహకారం తీసుకుంటే నాణ్యమైన ఉత్పత్తులు చేయవచ్చని నాబార్డు తెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం) ఉదయభాస్కర్‌ అన్నారు. శుక్రవారం షార్ప్‌ సంస్థ ఆధ్వర్యంలో వెల్లంకిలో ఏర్పాటు చేసిన సిరిపురం ఇక్కత్‌ హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ క్లస్టర్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. కోష ఏఐ సహకారంతో ఇక్కత్‌ వస్త్రాలకు డిజిటల్‌ ట్రేసబిలిటీ వ్యవస్థ ద్వారా ఉత్పత్తుల మూలాలు తెలుసుకునే అవకాశం కలుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా వెల్లంకి, సిరిపురం, బోగారం గ్రామాలకు చెందిన 20మంది చేనేత కార్మికులకు స్టాండ్‌ మగ్గాలు, వార్పు మిషన్లు, ఆసు మిషన్లు పంపిణీ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో నాబార్డు డీడీఎం ఝాన్సీ, అసిస్టెంట్‌ మేనేజర్‌ రణదీప్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ హరీష్‌, షార్ప్‌ సంస్థ సీఈఓ కూరెళ్ల నర్సింహాచారి ప్రోగ్రాం మేనేజర్‌ పోలోజు నర్సింహాచారి, ఫెసిలిటేటర్‌ అంకం నాగరాజు పాల్గొన్నారు.

ఫ నాబార్డు సీజీఎం ఉదయ్‌భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement