ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఏఐకేఎస్‌ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

Nov 6 2026 2:26 AM | Updated on Nov 6 2026 2:26 AM

నల్లగొండ టౌన్‌: నల్లగొండలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవన్‌లో జరిగిన మహాసభల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ మహాసభలకు దేశం నలుమూలల నుంచి 950 మందికి పైగా ప్రతినిధులు, పరిశీలకులు, నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ నెల 15న నల్లగొండలో లక్ష మంది రైతులతో భారీ ప్రదర్శన నిర్వహించి, అనంతరం ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధిక సంఖ్యలో రైతులు, పార్టీ నాయకులు, అభిమానులు ఈ మహాసభలకు హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి వీరపల్లి వెంకటేశ్వర్లు, మహిళా కన్వీనర్‌ కందాల ప్రమీల, నారి ఐలయ్య, డబ్బికార్‌ మల్లేష్‌, సయ్యద్‌ హాషం, పాలడుగు ప్రభావతి, ఎండీ సలీం, దండెంపల్లి సత్తయ్య, కంబాలపల్లి ఆనంద్‌, అవిశెట్టి శంకరయ్య ,బొజ్జ చిన్న వెంకులు, చింతపల్లి బయన్న, రాచకొండ వెంకట్‌గౌడ్‌, కొండ అనురాధ రవి నాయక్‌, మల్లయ్య పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే

జూలకంటి రంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement