రసాయన కంపెనీల్లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

రసాయన కంపెనీల్లో తనిఖీలు

Nov 5 2026 1:46 AM | Updated on Nov 5 2026 1:46 AM

భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాల పరిధిలో ఉన్న రసాయన కంపనీలను పీసీబీ, రెవెన్యూ, పరిశ్రమలు, వ్యవసాయ, ఆర్‌డబ్ల్యూఎస్‌, భూగర్భ జల అధికారుల బృందం తనిఖీ చేసింది. హెట్సిమ్‌ ఫార్మా, ఆప్టిమస్‌, ఎస్‌వీఆర్‌ రసాయన కంపనీలను సందర్శించి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లు ఉన్నాయా లేవా అని పరిశీలించింది. కంపెనీ సమీప ప్రాంతాల్లో మట్టి, భూగర్భజలాల శాంపిల్స్‌ సేకరించింది. నాలుగైదు అడుగుల్లోనే మట్టి నల్లగా మారి, భూగర్భంలో రసాయనాలతో నీళ్లు కలుషితమైనట్లు గుర్తించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్‌ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మూడు కంపెనీలలో మట్టి, నీళ్ల శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నామన్నారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, పీసీబీ టెక్నికల్‌ ఆఫీసర్‌ శంకర్‌, డీఎల్‌పీఓ ప్రతాప్‌నాయక్‌, ఏఓ శైలజ, పరిశ్రమల శాఖ ఈడీసీ రంజిత్‌కుమార్‌, ఎంఆర్‌ఐ సుధాకర్‌రావు, పోచంపల్లి, చౌటుప్పల్‌ మండలాల ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈలు సాయినాథ్‌రెడ్డి, విశాల్‌రెడ్డి, భూగర్భజలాల శాఖ ఏఈ ఆశ్విత్‌, అసిస్టెంట్‌ హైడ్రో జియోలజిస్ట్‌ ఐశ్వర్య, ఏఈఓ నరేశ్‌, సర్పంచులు గుమ్మి జంగారెడ్డి, జంగయ్య, మాజీ సర్పంచ్‌ పగిళ్ల రాంరెడ్డి, ఉపసర్పంచులు బద్దం వెంకట్‌రెడ్డి, మురహరి, స్థానికులు ముద్దం సత్యం, ప్రసాదం విష్ణు, రావుల లింగస్వామి, గుమ్మి దామోదర్‌రెడ్డి, గుమ్మి నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement