మిర్యాలగూడ: మండలంలోని శ్రీనివాస్‌నగర్‌కు చెందిన ఆదె సత్యనారాయణ జాతీయ స్థాయి హిప్నాసిస్ అవార్డు అందుకున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలోని భాస్కర ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో మైండ్ సపోర్ట్ హిప్నాసిస్ అండ్ కౌన్సిలింగ్ సంస్థ ఆయనకు ఎక్స్‌లెన్స్ ఇన్ హిప్నోథెరపి–నేషనల్ హిప్నాసిస్ అవార్డు అందజేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్‌ఎల్‌పీ, హిప్నాసిస్ ఆధారిత పద్ధతులు, సమాచార వినిమయ నైపుణ్యాలు, ప్రేరణాత్మక శిక్షణ ద్వారా వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం, స్వీయ అవగాహన, వ్యక్తిగత సామర్థ్యాల వికాసానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.


