నల్లగొండ టౌన్ : రైతులకు విరివిగా పంట రుణాలు మంజూరు చేస్తామని నల్లగొండ డీసీఓ, అఫీషియల్ పీఐసీ కమిటీ మెంబర్ మమత అన్నారు. నల్లగొండలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మహాజన సభలో ఆమె మాట్లాడారు. సమావేశంలో సొసైటీల చైర్మన్లు లేవనెత్తిన అంశాలైన పంట రుణాల వితరణ, వసూలు, డివిడెంట్ అంశాలపై సానుకూలంగా ఆమె స్పందిస్తూ త్వరలోనే అన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ్యాంకు పరిపాలన వార్షిక నివేదికను, సర్టిఫికెట్లు, జమ ఖర్చులు, లాభనష్టాలను ఆమోదించారు. సమావేశంలో యాదాద్రి జిల్లా డీసీఓ నాగార్జున, నాబార్డ్ డీడీఎం వినయ్‌కుమార్, మైకేల్‌బోసు, బ్యాంక్ సీఈఓ శంకర్‌రావు, జీఎం నర్మద, సంఘం చైర్మన్లు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.


